రామభద్రపురం మండలం, కొండకెంగువ గ్రామంలో ప్రతియేటా భీష్మ ఏకాదశి రోజున జరిగే "దేవుడుబాబు" యాత్రలో బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్. వి. ఎస్. కె. కె. రంగారావు (బేబీ నాయన) పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి చింతల రామకృష్ణ, విజయనగరం జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు మడక తిరుపతి, మండల టీడీపీ అధ్యక్షుడు కరణం భాస్కరరావు, గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.