బొబ్బిలి పురపాలక సంఘం కౌన్సిల్ ప్రత్యేక బడ్జెట్, అత్యవసర సమావేశం శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఆర్. వి. ఎస్. కె. కె. రంగారావు (బేబీ నాయన) పాల్గొన్నారు. పట్టణ ప్రజలకు మౌళిక సదుపాయాల కల్పనే లక్ష్యమని, తాగునీరు, రోడ్లు, కాలువల అభివృద్ధి, చెరువుల పునరుద్ధరణ, పర్యాటక అభివృద్ధిపై చర్చించారు. ఇందిరమ్మ కాలనీ సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని, పర్యాటక శాఖ సహకారంతో బొబ్బిలిని మరింత అందంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.