సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

198చూసినవారు
సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో బొబ్బిలి నియోజకవర్గంలో 33 మంది లబ్ధిదారులకు రూ. 20,10,954 ఆర్థిక సహాయం మంజూరైంది. ఎమ్మెల్యే ఆర్. వీ. ఎస్. కే. కే. రంగారావు (బేబీ నాయన) బొబ్బిలి కోటలో ఈ చెక్కులను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేద ప్రజలకు పెద్దకొడుకులా సేవలు అందిస్తున్నారని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎంఆర్ఎఫ్ పేదలకు ముఖ్యమైన సహాయంగా మారిందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్