బొబ్బిలి మండలం దిబ్బగుడివలస గ్రామంలో ఎమ్మెల్యే ఆర్. వీ. ఎస్. కె. కె. రంగారావు (బేబీ నాయన) రైతులకు రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో భూముల రీసర్వే పూర్తైన గ్రామాల్లో కొత్త పాసుపుస్తకాలు అందజేస్తుండగా, అందులో భాగంగా ఈ గ్రామ రైతులకు పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లాడ భాస్కరరావు, జే. వి. ఎస్. ఎస్. రామ్మోహనరావు, వాసిరెడ్డి సత్యనారాయణ, వెన్నెల నాగరాజు, ఎం. శ్రీను తదితరులు పాల్గొన్నారు.