బొబ్బిలి జన సేన పార్టీ ఆఫీసులో డొక్కా సీతమ్మ క్యాంటీన్

1234చూసినవారు
విజయనగరం జిల్లా బొబ్బిలి జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం డొక్కా సీతమ్మ క్యాంటీన్ పేరుతో పేదలకు భోజన సదుపాయాలు కల్పించే కార్యక్రమం ప్రారంభమైంది. జనసేన పార్టీ ఇంచార్జ్ గిరడ అప్పలస్వామి ఆధ్వర్యంలో ప్రతి సోమవారం 500 మంది నిరుపేదలకు భోజనం అందించనున్నారు. ఆకలి తీర్చడం పుణ్యకార్యమని అప్పలస్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్