జూలై 2న బొబ్బిలి మండలం చిత్ర కోటబొడ్డవలస పంచాయితీ చెల్లివలస గిరిజన గ్రామంలో పిరిడి వైద్యాధికారి డాక్టర్ భరద్వాజ్ మలేరియా నివారణ లక్ష్యంగా ముందస్తు సర్వే నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో రాపిడ్ టెస్టులు చేసి, అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో Eo తిరుపతిరావు, MLHP మౌనిక, హెల్త్ అసిస్టెంట్ M తవిటినాయుడు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.