శాస్త్రీయ నృత్య కళాకారుల సమాఖ్య చే భాగవతార్ శంకర రావు ఘన సన్మానం

318చూసినవారు
భరత ముని జయంతి ఉత్సవాల సందర్భంగా, ఆదివారం పిఠాపురం శ్రీపాద వల్లభ అనఘా దత్త క్షేత్రంలో శాస్త్రీయ నృత్య కళాకారుల సమాఖ్య, బొబ్బిలి మండలం కోమటి పల్లి గ్రామానికి చెందిన తూర్పు భాగవత కళాకారులు డాక్టర్ బొంతలకోటి శంకర రావు భాగవతార్‌ను ప్రముఖ కూచిపూడి పరిశోధకులు కళారత్న డాక్టర్ కాజా వెంకట సుబ్రహ్మణ్యం, సంస్థ అధ్యక్షులు లోకేష్ శర్మ తదితరులు గురు పురస్కారంతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శంకర రావు మాట్లాడుతూ అంతరించిపోతున్న ప్రాచీన కళలను గుర్తించి, వారిని ప్రోత్సహిస్తున్న శాస్త్రీయ నృత్య కళాకారుల సమాఖ్య వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్