కొరటాంలో ముందస్తు పింఛన్ పంపిణీ

379చూసినవారు
కొరటాంలో ముందస్తు పింఛన్ పంపిణీ
కూటమి ప్రభుత్వం ప్రతీ నెల 1వ తేదీన అందించే ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌ను ఈ నెల ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా బొబ్బిలి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్. వీ. ఎస్. కే. కే. రంగారావు (బేబీ నాయన) తెర్లాం మండలం కొరటాం గ్రామంలో టీడీపీ నాయకులు, సచివాలయ సిబ్బందితో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నర్సుపల్లి వెంకటనాయుడు, కొరటాం గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్