బాలల స్నేహపూర్వక గ్రామాలపై విజయవాడలో రాష్ట్ర స్థాయి సదస్సు

546చూసినవారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైల్డ్ రైట్స్ ఫోరం ఆధ్వర్యంలో విజయవాడ స్వర్ణ ప్యాలస్ లో బుధవారం బాలల స్నేహపూర్వక గ్రామాలపై రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఈ సదస్సులో బొబ్బిలి మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన తూర్పు భాగవతం కళాకారులు పాల్గొన్నారు. వారు తూర్పు భాగవతం గురించి వివరించడమే కాకుండా, సత్యభామ, శ్రీకృష్ణుల మధ్య జరిగిన కలహానికి గల కారణాలను కూడా తెలియజేశారు. వారి ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది, అందరూ హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్