బొబ్బిలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో అత్యవసర సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. సమావేశంలో ఎంపీడీవో రవికుమార్, ఆర్‌డబ్ల్యూఎస్ అసిస్టెంట్ ఇంజనీర్ తేజ, ఇన్‌చార్జి ఈఓఆర్డీ కృష్ణమ్మ పాల్గొన్నారు.