బొబ్బిలి మండలంలోని పిరిడి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద చెరువు పనులను స్థానిక ఎంపీడీవో, సర్పంచ్ బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొని పూజలు నిర్వహించారు. వేతనదారులకు పథకం, పని దినాల కల్పన, వేతనాల చెల్లింపుపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. ఫీల్డ్ అసిస్టెంట్, మేట్లు, కూలీలు పాల్గొన్నారు.