విజయనగరం జిల్లా, బొబ్బిలి నియోజకవర్గం, బాడంగి మండలం, లక్ష్మీపురం పంచాయతీలోని ఎరుకులపాకలు గ్రామంలో ఆదివారం పల్స్ పోలియో డే సందర్భంగా వైస్ ఎంపీపీ పాలవలస గౌరీ ఆధ్వర్యంలో ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. పోలియో రహిత సమాజాన్ని నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని ఆమె ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి, హెల్త్ సిబ్బంది పాల్గొన్నారు.