రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన

5చూసినవారు
రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన
బొబ్బిలి మండలం మెట్టవలస గ్రామంలో మంగళవారం “పొలం పిలుస్తుంది” కార్యక్రమం నిర్వహించి, ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో వరికి ప్రత్యామ్నాయంగా అపరాల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఎల్‌నినో ప్రభావంతో వరి సాగు సాధ్యంకాని పరిస్థితుల్లో అపరాలను సాగు చేయడం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యాజమాన్య పద్ధతులను వివరించారు. అలజంగి గ్రామంలో వరి పొలాల్లో కలుపు నివారణకు బియ్యపు నూకను ఎకరాకు 50–60 కిలోల చొప్పున విత్తిన ఐదు రోజుల్లోపు వేసే పద్ధతిని పైల వేణుగోపాల్ పొలంలో ప్రదర్శన ద్వారా వివరించారు.

సంబంధిత పోస్ట్