వేణుగోపాలస్వామి రథ నిర్మాణ విరాళాలకు ఫిబ్రవరి 10 తుదిగడువు

142చూసినవారు
బొబ్బిలి ఆస్థాన దేవదేవుడు వేణుగోపాలస్వామి రథం తయారీ కోసం విరాళాల సేకరణకు ఫిబ్రవరి 10ను ఆఖరి తేదీగా ఎమ్మెల్యే ఆర్. వి. ఎస్. కె. కె. రంగారావు (బేబీ నాయన) నిర్ణయించారు. రథ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలనే సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే స్పందించిన భక్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంకా వివరాలు అందించాల్సిన వారు ఫిబ్రవరి 10లోపు పూర్తి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనేకమంది భక్తులు విరాళాలు అందించేందుకు ముందుకు వచ్చారు.

సంబంధిత పోస్ట్