కోమటిపల్లిలో అగ్నిప్రమాదం.. రెండు ఇళ్లు దగ్ధం

228చూసినవారు
కోమటిపల్లిలో అగ్నిప్రమాదం.. రెండు ఇళ్లు దగ్ధం
బొబ్బిలి మండలం కోమటిపల్లిలో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో మోతి గౌరి ఇల్లు పూర్తిగా, మోతి సాంబయ్య ఇల్లు పాక్షికంగా కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోంది. ఈ ఘటనతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్