బొబ్బిలి పట్టణంలో రూ. 25 కోట్లతో చేపట్టనున్న సీసీ, బీటీ రోడ్లు, సెంట్రల్ డివైడర్లు, ఎల్‌ఈడీ విద్యుత్ దీపాలు, పార్కుల అభివృద్ధి పనులకు మంగళవారం శంకుస్థాపన జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న HAM ప్రాజెక్టులను సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. బొబ్బిలి కళాభారతిలో జరిగే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, స్థానిక ఎమ్మెల్యే బేబీనాయన పాల్గొననున్నారు. కార్యక్రమ ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ పరిశీలిస్తున్నారు.