బొబ్బిలి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో మహాకవి గురజాడ అప్పారావు జయంతి వేడుకలను పోలీసు అధికారులు ఘనంగా నిర్వహించారు. గురజాడ చిత్రపటానికి నివాళులర్పించి ఆయన సాహిత్య సేవలను స్మరించుకున్నారు. అనంతరం బొబ్బిలి చైతన్య హైస్కూల్ రోడ్డులో పోలీసులు విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ప్రజలకు భద్రతపై భరోసా కల్పిస్తూ ట్రాఫిక్, శాంతిభద్రతల పరిస్థితిని పర్యవేక్షించారు.