బొబ్బిలి ఎంపీడీవో రవికుమార్ బుధవారం స్థానిక ఎం. బూర్జవలస గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, 'జలధార' పథకం అమలు, యూత్ క్లబ్‌ల ఏర్పాటుపై సిబ్బందికి సూచనలు చేశారు. ప్రభుత్వ సర్వేలను త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రజలకు సేవల్లో అలసత్వం వహించరాదని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.