బొబ్బిలి మండలం మల్లంపేట గ్రామంలోని పోలింగ్ స్టేషన్ నంబర్లు 36, 37లను బొబ్బిలి తహసీల్దార్ ఎం. శ్రీను తనిఖీ చేశారు. బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గంలో బాటమ్-10లో ఉన్న ఈ పోలింగ్ స్టేషన్లలో ఈఎఫ్ డిజిటలైజేషన్ పురోగతిని పరిశీలించిన ఆయన, ప్రతీ పోలింగ్ స్టేషన్‌లో రోజుకు కనీసం 100 ఈఎఫ్‌లు డిజిటలైజేషన్ పూర్తి చేయాలని, స్థానిక బీఎల్ఏల సమన్వయంతో పనులు వేగవంతం చేసి బాటమ్-10 జాబితా నుంచి బయటపడేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత బీఎల్ఓలకు ఆదేశించారు.