బొబ్బిలి మండలంలోని మెట్టవలస గ్రామంలో ప్రభుత్వ సేవలపై ప్రజల అభిప్రాయాలను సేకరించే ఐవిఆర్ఎస్ (IVRS) ఫోన్ కాల్స్ గురించి శనివారం అవగాహన కల్పించారు. ఎంపీడీవో రవికుమార్, డిప్యూటీ ఎంపీడీవో అల్లు భాస్కర్, పంచాయతీ కార్యదర్శి శ్రీహరి పాల్గొన్న ఈ కార్యక్రమంలో, ప్రభుత్వం నుండి అందుతున్న పథకాలు, పెన్షన్లు, సచివాలయ సేవలపై నేరుగా ప్రజలకే ఫోన్ కాల్స్ వస్తాయని అధికారులు వివరించారు. ప్రజలు తమకు అందుతున్న సేవలకు సంబంధించి మొబైల్‌కు వచ్చే ఐవిఆర్ఎస్ కాల్స్‌కు సరైన సమాధానం చెప్పడం ద్వారా సేవల నాణ్యతను పెంచవచ్చని, ఈ విధానం ద్వారా ప్రభుత్వ పాలనలో పారదర్శకత పెరుగుతుందని, ప్రజలు భయం లేకుండా తమ అభిప్రాయాలను పంచుకోవాలని అధికారులు కోరారు.