బొబ్బిలి పట్టణ సీఐగా కె. నారాయణరావు గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు బొబ్బిలి రూరల్ సీఐగా పనిచేసిన ఆయనను బదిలీపై పట్టణ సీఐగా ఉన్నతాధికారులు నియమించారు. గతంలో పట్టణ సీఐగా పనిచేసిన కటకం సతీష్ కుమార్ ను వీఆర్ పై విశాఖకు పంపించారు. ఉత్తరాంధ్ర నుంచి పలువురు సీఐలు పోటీ పడినప్పటికీ, రూరల్ సీఐగా అనుభవం ఉన్న నారాయణరావును ఎంపిక చేయడం గమనార్హం.