విద్యుత్‌ పనుల్లో లైన్మెన్‌కు గాయం

4చూసినవారు
విద్యుత్‌ పనుల్లో లైన్మెన్‌కు గాయం
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం మెట్టవలస గ్రామంలో శుక్రవారం విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా లైన్మెన్ కే. నగేష్ ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభం నుంచి కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయన చేయి విరిగింది. అధికారులు ఆయనకు ప్రాణాపాయం లేదని తెలిపారు. ఎంపీడీవో, డిప్యూటీ ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి సంఘటనా స్థలంలోనే ఉన్నారు.

సంబంధిత పోస్ట్