మెట్టవలసలో మల్లమ్మ చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం

4చూసినవారు
మెట్టవలసలో మల్లమ్మ చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం మెట్టవలస గ్రామంలో వాటర్ షెడ్ పథకం కింద మంజూరైన మల్లమ్మ చెరువు అభివృద్ధి పనులను శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఫీల్డ్ అసిస్టెంట్ కెల్ల అప్పారావు, వైస్ ఎంపీపీ శంకర్రావు, అల్లాడ భాస్కరరావు, మాజీ సర్పంచులు కెల్ల సత్యనారాయణ, పువ్వల మాధవరావు, పువ్వల నరసింహారావు, పువ్వల వెంకటరమణ (శాస్త్రి), గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. చెరువుగట్టు వెడల్పు, విద్యుత్ దీపాలు, సిమెంట్ కుర్చీల ఏర్పాటు వంటి పనులు చేపట్టనున్నారు.

సంబంధిత పోస్ట్