భక్తి, శ్రద్ధలతో మట్టలాదివారం

173చూసినవారు
భక్తి, శ్రద్ధలతో మట్టలాదివారం
సాలూరు పట్టణంలోని సెయింట్ లూధరన్ చర్చ్‌లో పాస్టర్ జాన్ విక్టర్ విశ్వాసులకు మట్టలాదివారం ప్రాముఖ్యతను వివరించారు. యేసు క్రీస్తు యెరూషలేములోకి జయప్రద ప్రవేశాన్ని స్మరించుకుంటూ, మట్టలను చేతబట్టి భక్తిశ్రద్ధలతో ప్రదర్శన నిర్వహించారు. మట్టలాదివారం తర్వాతి ఐదు రోజులను హోలీ డేస్‌గా పిలుస్తారని, గుడ్ ఫ్రైడే, పునరుత్థాన ఆదివారం విశిష్టతను వివరించారు. సమర్పణ, త్యాగం, విధేయత, స్వీయ క్రమశిక్షణను ఆచరించాలని సూచించారు. కార్యక్రమంలో పి. రాజు, జోసెఫ్, శేఖర్, మెర్సీ బాయి, వజ్ర కుమారి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్