సీహెచ్‌సీలో మెగా వైద్య శిబిరం.. రోగులకు వైద్య సేవలు

3చూసినవారు
సీహెచ్‌సీలో మెగా వైద్య శిబిరం.. రోగులకు వైద్య సేవలు
విజయనగరం జిల్లా బొబ్బిలి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో మంగళవారం సేవా సంకల్ప్ అభియాన్–2026 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్. వీ. ఎస్. కే. కే. రంగారావు (బేబీనాయన) పాల్గొన్నారు. ఆయన ఆసుపత్రిలో రోగులతో మాట్లాడి వైద్య సేవలు, సదుపాయాలపై ఆరా తీశారు. మెగా వైద్య శిబిరం నిర్వహించి వైద్య పరీక్షలు, నిపుణుల సలహాలు, చికిత్సా సేవలు అందించారు. అనంతరం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో అభివృద్ధి అంశాలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్