తెర్లాం మండలం పణుకువలస గ్రామం వద్ద కుంగిపోయిన వంతెనను ఎమ్మెల్యే ఆర్. వీ. ఎస్. కె. కె. రంగారావు (బేబీనాయన) ఆర్&బీ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా డైవర్షన్ రోడ్డు వెంటనే నిర్మించాలని సూచించారు. నూతన వంతెన, డైవర్షన్ రోడ్డు నిర్మాణానికి రూ. 2. 8 కోట్ల ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు తెలిపారు. అనుమతులు త్వరగా పూర్తిచేయాలని చీఫ్ ఇంజనీర్‌ను ఎమ్మెల్యే కోరారు.