మహాకవి గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా బొబ్బిలి కోటలో ఎమ్మెల్యే ఆర్. వీ. ఎస్. కె. కె. రంగారావు (బేబీనాయన) పార్టీ శ్రేణులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సాహిత్యానికి గురజాడ కొత్త ఒరవడి తీసుకొచ్చారని, నాటి సాంఘిక దురాచారాలను ప్రశ్నిస్తూ సమాజ చైతన్యానికి కృషి చేసిన మహాకవి అని కొనియాడారు.