పేద రిక్షా కార్మికుడికి ఎమ్మెల్యే అండగా నిలిచారు

242చూసినవారు
పేద రిక్షా కార్మికుడికి ఎమ్మెల్యే అండగా నిలిచారు
బొబ్బిలి పట్టణం 22వ వార్డు ప్రేమనగర్‌కు చెందిన రిక్షా కార్మికుడు ఆకుల లక్ష్మణ రిక్షా ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో దెబ్బతింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల మరమ్మతులు చేయించుకోలేకపోయిన లక్ష్మణ రిక్షాను ఫ్లైఓవర్‌పై ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీ ఆర్.వీ.ఎస్.కె.కె. రంగారావు (బేబీనాయన) లక్ష్మణ వివరాలు తెలుసుకుని, వెంటనే రిక్షాను మరమ్మతు చేయించి అతనికి అందజేశారు. ఎమ్మెల్యే సహాయానికి లక్ష్మణ కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్