పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎంపీడీవో రవికుమార్ పరిశీలించారు

826చూసినవారు
పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎంపీడీవో రవికుమార్ పరిశీలించారు
బొబ్బిలి మండలం గోపాల్‌రాయుడుపేట గ్రామపంచాయతీ పరిధిలోని నారసింహునిపేట గ్రామంలో ఆదివారం నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని స్థానిక ఎంపీడీవో రవికుమార్ పరిశీలించారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయాలని సిబ్బందికి సూచించారు. గ్రామ ప్రజలు ఈ కార్యక్రమానికి సహకరించి, ఏ చిన్నారూ పోలియో చుక్కలు మిస్ కాకుండా చూసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్