ఆంధ్రప్రదేశ్ నాయీ బ్రాహ్మణ సంఘం సభ్యులు విజయనగరం, బొబ్బిలిలో ఎమ్మెల్యే బేబీనాయనకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. 50 ఏళ్లు పైబడిన నాయీ బ్రాహ్మణులకు పింఛను అందించాలని, వృత్తి కారణంగా అనారోగ్య సమస్యలతో ఉపాధి కోల్పోతున్న వారికి, వాయిద్య కళాకారులకు కూడా పింఛను ఇవ్వాలని, జీవో 50ను చట్టబద్ధం చేయాలని వారు కోరారు. ఈ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీలో ప్రస్తావించాలని విజ్ఞప్తి చేశారు.