ఏపీఎల్ గ్రాండ్ ఫైనల్‌కు నారా లోకేష్‌కు ఆహ్వానం

870చూసినవారు
ఏపీఎల్ గ్రాండ్ ఫైనల్‌కు నారా లోకేష్‌కు ఆహ్వానం
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)-2026 సీజన్–5 టీ20 టోర్నమెంట్ గ్రాండ్ ఫైనల్‌కు రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ను ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ రావు వెంకట సుజయ్ కృష్ణ రంగారావు ఉండవల్లిలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. జూన్ 30న మంగళగిరి ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ ఫైనల్‌కు ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేయాలని కోరారు. యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీసేందుకు ఏపీఎల్ మంచి వేదికగా నిలుస్తోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్