మల్లమ్మపేట అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం పోషణ్ మాసోత్సవం-2026 సందర్భంగా, మంచి పోషకాహారంతోనే తల్లి, బిడ్డల ఆరోగ్యం, పిల్లల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని బొబ్బిలి ఐసీడీఎస్ సీడీపీఓ విజయలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలు, తల్లులు, కిశోర బాలికలకు సమతుల ఆహారం, ప్రోటీన్ అధికంగా ఉండే పదార్థాలు, పోషకాహార ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రామకుమారి, అంగన్వాడీ టీచర్లు, ఐసీడీఎస్ లబ్ధిదారులు పాల్గొన్నారు.