పారాదిలో పోషణ మహా కార్యక్రమం

5చూసినవారు
పారాదిలో పోషణ మహా కార్యక్రమం
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పారాది గ్రామంలో అంగన్వాడీ ఉత్సవాలు, పోషణ మహా కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ ద్వారా అమలవుతున్న ప్రభుత్వ పథకాలపై సీడీపీఓ విజయలక్ష్మి అవగాహన కల్పించారు. మెరుగైన సేవలు అందించిన అంగన్వాడీ కార్యకర్తలను గ్రామ పెద్దలు సన్మానించారు. చిన్నారులకు ప్లేట్లు, గ్లాసులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్, గ్రామ పెద్దలు, ఆశా వర్కర్లు, మహిళా పోలీస్, ఉపాధ్యాయులు, తల్లులు మరియు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్