పోషణ పక్షం కార్యక్రమాలు ప్రారంభం. తల్లి, శిశు ఆరోగ్యంపై అవగాహన

359చూసినవారు
పోషణ పక్షం కార్యక్రమాలు ప్రారంభం. తల్లి, శిశు ఆరోగ్యంపై అవగాహన
బొబ్బిలి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఏప్రిల్ 9 నుండి 23 వరకు పోషణ పక్షం కార్యక్రమాలు జరుగుతున్నాయి. సీడీపీఓ జె. విజయలక్ష్మి మాట్లాడుతూ, గర్భిణీలు సమతుల్య ఆహారం తీసుకోవడం, ఏఎన్‌సీ పరీక్షలు చేయించుకోవడం, బలవర్ధక ఆహారం వినియోగం అవసరమని సూచించారు. శిశువుకు జననం తర్వాత మొదటి ఆరు నెలలు పూర్తిగా తల్లిపాలే ఇవ్వాలని, అనంతరం అనుబంధ ఆహారం ప్రారంభించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఏఎన్‌ఎమ్‌లు, ఆశా, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్