బొబ్బిలిలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

4చూసినవారు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం జిల్లా బొబ్బిలిలో బుధవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. జనసేన పార్టీ బొబ్బిలి నియోజకవర్గ ఇన్‌చార్జ్ గిరడ అప్పలస్వామి ఆధ్వర్యంలో భారీ ఊరేగింపు జరిగింది. ఈ ఊరేగింపులో జనసేన నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నినాదాలు, సందడి మధ్య సాగిన ఈ వేడుకలు అంబరాన్నంటాయి. అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్