కొమాటిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో పాఠశాల కమిటీ ఎన్నికల నేపథ్యంలో బొబ్బిలి ఎస్హెచ్ఓ ఆధ్వర్యంలో తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ‘మీతో మేము’ కార్యక్రమం కరపత్రాలను పంపిణీ చేసి మాదకద్రవ్యాలు, గంజాయి వినియోగం వల్ల కలిగే నష్టాలు, సైబర్ భద్రత, శక్తి యాప్ వినియోగం, రహదారి భద్రతతో పాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై అవగాహన కల్పించారు.