బొబ్బిలి, జూన్ 12: ప్రజల భద్రతను దృష్టిలో ఉం
చుకుని, బొబ్బిలి పట్టణంలోని రాజా కాలేజ్ రోడ్ జంక్షన్ వద్ద సిఐ నారాయణరావు నేతృత్వంలో పోలీసులు విజిబుల్ పోలీసింగ్, వాహనాల తనిఖీలు చేపట్టారు. వాహనదారుల పత్రాలను పరిశీలించి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు ఈ తరహా తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు వెల్లడించారు.