బొబ్బిలిలో ఆర్టీసీ కాంప్లెక్స్‌లో డ్రగ్స్, గంజాయిపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు

1098చూసినవారు
బొబ్బిలిలో ఆర్టీసీ కాంప్లెక్స్‌లో డ్రగ్స్, గంజాయిపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు
విజయనగరం జిల్లా బొబ్బిలిలో, బొబ్బిలి డీఎస్పీ ఆధ్వర్యంలో పట్టణ ఎస్‌హెచ్‌ఓ, ట్రాఫిక్ ఎస్‌ఐతో కలిసి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ప్రయాణికుల బ్యాగులను ఆకస్మికంగా బుధవారం తనిఖీ చేశారు. డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా, ఈవ్‌టీజింగ్, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించేందుకు ఈ తనిఖీలు చేపట్టారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అనుమానాస్పద ఘటనలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్