బొబ్బిలిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. నలుగురు అరెస్ట్

2చూసినవారు
బొబ్బిలిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. నలుగురు అరెస్ట్
బొబ్బిలి లోగాల గౌడ్ వీధిలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మొనకాల వెంకటరమణ ఇంటి వెనుక భాగంలో పేకాట జరుగుతుండగా దాడి చేసి మొనకాల వెంకటరమణ, అక్కపోలు శంకరరావు, శంకరాపు నారాయణరావు, బోని కోటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 1, 64, 900 నగదు, 3 సెల్‌ఫోన్లు, 2 మోటార్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వెంకటరమణపై ఇప్పటికే 2, శంకరరావుపై 7 పేకాట కేసులు ఉన్నాయని సీఐ నారాయణరావు తెలిపారు. పేకాట, బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని ఎస్ఐ కొండలరావు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్