పీఆర్‌సీ, బకాయిల చెల్లింపుపై ఎమ్మెల్యేకు వినతిపత్రం

144చూసినవారు
పీఆర్‌సీ, బకాయిల చెల్లింపుపై ఎమ్మెల్యేకు వినతిపత్రం
బొబ్బిలి నియోజకవర్గంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వెంటనే 12వ పీఆర్‌సీ ప్రకటించాలని కోరుతూ యుటీయఫ్ నాయకులు ఎమ్మెల్యే బేబీ నాయనను కలిసి వినతిపత్రం అందజేశారు. పీఆర్‌సీ కమిటీని తక్షణమే నియమించడం, మధ్యంతర భృతి ప్రకటించడం, ఉద్యోగులు-ఉపాధ్యాయులకు బకాయి ఉన్న సుమారు రూ. 29 వేల కోట్లను చెల్లించడం, బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించాలని వారు కోరారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ ఈ అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీలో ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్