బొబ్బిలిలో జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు చురుకుగా పాల్గొన్నారు. రోటరీ జిల్లా చైర్ డా. జె.సి. రాజు, అధ్యక్షుడు హరి, డైరెక్టర్ శ్రీనివాసన్ బస్ కాంప్లెక్స్ పోలియో కేంద్రంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 'నిండు జీవితానికి రెండు చుక్కలు తప్పనిసరి' అని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. వైద్య సిబ్బందికి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసి, పోలియో నిర్మూలనే తమ లక్ష్యమని తెలిపారు.