పారాది పాఠశాలలో వినూత్న మూల్యాంకన పద్ధతులపై సమీక్ష

1చూసినవారు
పారాది పాఠశాలలో వినూత్న మూల్యాంకన పద్ధతులపై సమీక్ష
బొబ్బిలి మండలం పారాది జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం స్కూల్ కాంప్లెక్స్ సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో మోహన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల ఇంగ్లీష్, హిందీ ఉపాధ్యాయులు హాజరయ్యారు. డెల్టా అధ్యక్షులు, ఇంగ్లీష్ ఉపాధ్యాయులు మంది విజయమోహన్ రావు రాబోయే 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో వినూత్న మూల్యాంకన పద్ధతులపై అవగాహన కల్పించారు. విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలు పెంచేందుకు 'స్పెల్ బీ' పోటీలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రమేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్