బొబ్బిలి మండలం కమ్మవలస గ్రామంలో సర్పంచ్ పిల్లా వసుంధరను గ్రామ పెద్దలు, ప్రజలు ఘనంగా సన్మానించారు. ఎన్నికల హామీలను నెరవేరుస్తూ, పార్టీలకు అతీతంగా అందరినీ సమానంగా చూసి పరిపాలన సాగించారని ఆమెను కొనియాడారు. అతి చిన్న వయసులోనే ప్రజల మన్ననలు పొందిన వసుంధరను శాలువా, పూల బొకేతో సత్కరించారు. ఈ సందర్భంగా వసుంధర మాట్లాడుతూ, ఐదేళ్ల కాలంలో అందరి సహకారం మరువలేనిదని, వార్డు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు, ఉపసర్పంచ్, సిబ్బంది పాల్గొన్నారు.