వైఎస్సార్సీపీ నేత కుటుంబాన్ని పరామర్శించిన శంబంగి

181చూసినవారు
వైఎస్సార్సీపీ నేత కుటుంబాన్ని పరామర్శించిన శంబంగి
తెర్లాం మండలం అమిటి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు గులిపిల్లి సత్యనారాయణ మాతృమూర్తి అచ్యమ్మ  అనారోగ్యంతో మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు  వారి నివాసానికి వెళ్లి భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్