ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి

154చూసినవారు
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి
బొబ్బిలి మునిసిపల్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. "ఒక గ్రామం –ఒక నెల – నాలుగు సందర్శనలు" కార్యక్రమం ద్వారా ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావచ్చని కలెక్టర్ తెలిపారు. అర్జీలపై సంబంధిత శాఖలు వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో రామ్మోహన్ రావు, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస పాణి, ఇంచార్జి కమిషనర్ కిరణ్ కుమార్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్