విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం... బొబ్బిలిలో కలకలం

460చూసినవారు
విజయనగరం జిల్లా బొబ్బిలిలోని నారాయణ జూనియర్ కాలేజీ యాజమాన్యం, భవనం అద్దె, నిర్వహణ ఖర్చులు భరించలేకపోతున్నామని పేర్కొంటూ ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం విద్యార్థులకు ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు (టీసీలు) ఇవ్వాలని నిర్ణయించింది. విద్యా సంవత్సరం మధ్యలో ఈ నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమ పిల్లల భవిష్యత్తుపై అయోమయం నెలకొనడంతో, అధికారులు జోక్యం చేసుకోవాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్