పారాది గ్రామంలో స్వచ్ఛ రథం: పొడి వ్యర్థాల సేకరణతో ఆదాయం

444చూసినవారు
పారాది గ్రామంలో స్వచ్ఛ రథం: పొడి వ్యర్థాల సేకరణతో ఆదాయం
బొబ్బిలి రూరల్ మండలంలోని పారాది గ్రామంలో బుధవారం 'స్వచ్ఛ రథం' పర్యటించి, ఇంటింటికీ తిరిగి డ్రై వేస్ట్ (పొడి వ్యర్థాలను) సేకరించింది. సేకరించిన వ్యర్థాల విలువ ప్రకారం ప్రజలకు నగదు లేదా వస్తువుల రూపంలో చెల్లింపులు జరిగాయి. స్థానిక పంచాయతీ కార్యదర్శి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్లాస్టిక్ రహిత గ్రామాలే లక్ష్యంగా అవగాహన కల్పించారు. చెత్తను రోడ్లపై పారవేయకుండా, స్వచ్ఛ రథానికి అందించి పర్యావరణాన్ని కాపాడుతూనే ఆదాయాన్ని పొందవచ్చని తెలిపారు.

సంబంధిత పోస్ట్