బొబ్బిలి మండలం ముత్తావలస గ్రామంలో సర్పంచ్ పిల్లా వసుంధర భాస్కర్ ఆధ్వర్యంలో నిర్మించిన స్వర్గదామం షెడ్, ప్రహరీ గోడను ఎంపీపీ శ్రీమతి శంబంగి లక్ష్మి వేణుగోపాల్ నాయుడు ప్రారంభించారు. నిధులను సద్వినియోగం చేసుకుని మండలంలోనే మేటిగా ఈ నిర్మాణాన్ని చేపట్టిన సర్పంచ్‌ను ఎంపీపీ అభినందించారు. సర్పంచ్ వసుంధర సహకరించిన జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు, ఎమ్మెల్యే బేబీ నాయన గారికి, ఎంపీపీ లక్ష్మి గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు మరియు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.