బొబ్బిలిలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనం

461చూసినవారు
బొబ్బిలిలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనం
బొబ్బిలిలోని తారకరామా కాలనీలో ఆదివారం తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు జరిగాయి. స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, ఎన్టీఆర్ ఆశయ సాధనకు పునరంకితం కావాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్