ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక మరియు సాంస్కృతిక సమితి వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ఉగాది పురస్కారాలను ప్రకటించింది. ఈ సందర్భంగా, జానపదం–తప్పెటగుళ్లు విభాగంలో ప్రతిభ కనబరిచిన బాడంగి మండలం జీకేఆర్ పురం గ్రామానికి చెందిన నీలబోను సత్యంకు ఈ పురస్కారం దక్కింది. గురువారం బొబ్బిలి కోటలో ఎమ్మెల్యే ఆర్. వీ. ఎస్. కె. కె. రంగారావు (బేబీ నాయన) ఆయనను సత్కరించారు.